రాజ్భవన్లో నూతన సంవత్సర వేడుకలు
రాజ్భవన్లో నూతన సంవత్సర వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ దంపతులను ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. టీటీడీ, విజయవాడలోని శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానాలకు చెందిన వేద పండితులు గవర్నర్ దంపతులను ఆశీర్వదించారు. ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఎంపీ సురేష్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, సమాచార హక్కు చట్టం ముఖ్య కమిషనరు ఆర్ఎం బాషా, కమిషనర్లు బీవీ రమణ కుమార్, కాకర్ల చెన్నారెడ్డి, పి.శామ్యూల్ జోనాథన్ తదితరులు గవర్నర్ దంపతులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.













