సీఎం వైఎస్ జగన్ ను కలిసిన నూతన ఎమ్మెల్సీలు
నూతన ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన కర్రి పద్మశ్రీ, డా.కుంభా రవిబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. గవర్నర్ కోటాలో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులుగా పద్మశ్రీ, రవిబాబు నియమతులయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. వెలగపూడిలోని రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు కొయ్యే మోషేను రాజు తమ చాంబరులో కర్రి పద్మశ్రీ, డా.కుంభా రవిబాబుతో ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేయించారు. శాసన మండలి సభ్యులుగా వారు పాటించాల్సిన నియమ నిబంధనలు, అనుసరించాల్సిన విధి విధానాలు, నిర్వర్తించాల్సిన కార్యకలాపాలు తదితర విషయాలను తెలిపే పుస్తకాలతో కూడిన కిట్లను అధ్యక్షులు కొయ్యే మోషేను రాజు వారికి అందజేస్తూ అభినందనలు తెలిపారు.













