పల్నాడుకు కొత్త కలెక్టర్ ను నియమించిన ఈసీ…
ఎన్నికల అనంతరం పలనాడులో ఉద్రిక్త సంఘటనలు చోటుచేసుకున్నాయి. శాంతిభద్రతలకు లోపం కలగడంతో పలు ప్రాంతాలలో 144 సెక్షన్ ని కూడా అవలంబిస్తున్నారు. పల్నాడు తో పాటు మాచర్ల, తిరుపతి నియోజకవర్గాలలో పలు ప్రాంతాలను ఈనెల 13 సాయంత్రం నుంచి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. కొన్ని ప్రాంతాలలో జరిగిన అల్లర్ల కారణంగా ప్రజలు గాయపడడంతో పాటు తీవ్రభయాందోళనలకు గురి అయ్యారు.ఈ నేపథ్యంలో ఎందరో ఆఫీసర్లపై బదిలీ వేటు.. సస్పెన్షన్ వేటు పడింది. అల్లర్లు తీవ్రంగా జరిగిన నేపథ్యంలో పలనాడు జిల్లా కలెక్టర్ ను.. తిరుపతి ఎస్పీను ఎన్నికల సంఘం బదిలీ చేసిన విషయం తెలిసిందే. పల్నాడు జిల్లాకు ఈరోజు కొత్త కలెక్టర్ ని నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకేశ్ బాలాజీ లట్కర్ ను పల్నాటి కొత్త కలెక్టర్ గా నియమించిన ఈసీ ఈరోజు సాయంత్రం లోపు తిరుపతి, పల్నాడు, అనంతపురం జిల్లాలకు కొత్త ఎస్పీల పేర్లు కూడా ప్రకటించనున్నట్లు వెల్లడించింది.













