జనవరి 1 నుంచి ఆంధ్రప్రదేశ్‌కు కొత్త హైకోర్టు
హైదరాబాద్‌తో ముడిపడిన కీలక కార్యస్థానం.. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం విభజన అధికారికంగా పూర్తయింది. అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు పని చేయనుంది. కొత్త సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి నవ్యాంధ్ర, తెలంగాణ హైకోర్టులు వేటికవిగా పని చేస్తాయి. ఈ మేరకు రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఏపీకి 16 మంది, తెలంగాణకు 10 మంది న్యాయమూర్తులను కేటాయించారు. రాజధాని అమరావతి పరిధిలో నిర్మిస్తున్న జ్యుడీషియల్ కాంప్లెక్స్‌లో ఏపీ హైకోర్టు ఏర్పాటవుతుంది. ఈ భవన నిర్మాణం దాదాపుగా పూర్తికావొచ్చింది. ఇప్పటికే సిబ్బంది, కేసుల విభజన కూడా పూర్తయింది. సంక్రాంతి సెలవుల అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన కేసుల విచారణ అమరావతి కేంద్రంగానే జరుగుతుంది.













