Chandrababu : దేశాభివృద్ధిలో మనం రాష్ట్రం కీలక పాత్ర : చంద్రబాబు

రాజకీయ జీవితంలో తాను ఏనాడూ విశ్రాంతి తీసుకోలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం మునక్కాయలవారిపల్లెలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ పిల్లలకు బంగారు భవిష్యత్ అందించాలనేదే తన ఆశయమన్నారు. ఎవరైనా పింఛను తీసుకోకున్నా తర్వాతి నెల అందిస్తున్నామని చెప్పారు. అభివృద్ధి జరగాలి, ఆదాయం పెరగాలని చెప్పారు. ఆర్థిక సంస్కరణలు అమలు చేస్తేనే మార్పులు వస్తాయి. రాయలసీమ (Rayalaseema) ఇక నుంచి రాళ్ల సీమ కాదు. రతనాల సీమ. పేదవాడి జీవితాల్లో వెలుగులు నింపాలనేదే మా లక్ష్యం. సంపద సృష్టించడం చేతనైతే సంక్షేమ పథకాలు అమలు చేయవచ్చు. అప్పులు చేసిన ఏ కుటుంబం కూడా బాగుపడదు. ఆదాయం పెంచుకున్నప్పుడే జీవితాల్లో మార్పు సాధ్యం. రాష్ట్ర విభజన తర్వాత మనకు అనేక కష్టాలు వచ్చాయి. 2024`19 మధ్య దేశలో ఎక్కడా జరగని అభివృద్ధిని చేసి చూపించాం. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలకు మళ్లీ స్వేచ్చ వచ్చింది. మొన్నటి ఎన్నికల్లో ప్రజలు కూడా ఎంతో విజ్ఞత చూపించారు. దేశాభివృద్ధికి ప్రధాని మోదీ (Modi) అనేక సంస్కరణలు తెస్తున్నారు. దేశాభివృద్ధిలో మనం రాష్ట్రం కీలక పాత్ర పోషించాలి అని అన్నారు.
ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా తెలుగువాళ్లు కనిపిస్తారు. ఉన్నత విద్య, ఉపాధి, వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్తున్నారు. గత పాలకులు అధికారాన్ని స్వార్థ ప్రయోజనాలకు వాడుకున్నారు. వైసీపీ (YSRCP) హయాంలో అనర్హులు కూడా దివ్యాంగుల పింఛను తీసుకున్నారు. నిజమైన దివ్యాంగులకు మేం న్యాయం చేస్తాం. అనర్హులు పింఛను తీసుకోకుండా ప్రజలే ఆపాలి. గత పాలకులు రాయలసీమలో రక్తం పారించారు. మేం వచ్చాక సాగునీరు పారిస్తున్నాం. ఆడవాళ్లపై అఘాయిత్యాలు చేస్తే అదే వాళ్లకు చివరి రోజు. మహిళల ఆత్మగౌరవం దెబ్బతీస్తే కఠిన చర్యలు తప్పవు అన్నారు. కష్టాలో ఉన్న మామిడి రైతులను మేం ఆదుకున్నాం. మామిడికాయలు రోడ్డుపై పోసి వైసీపీ నేతలు డ్రామాలు ఆడారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టేముందు పదిసార్లు ఆలోచించాలి. కడప(Kadapa) , రాజంపేట మీదుగా కోడూరుకు నీళ్తు తీసుకెళ్తాం. రాజంపేట (Rajampet )లో వ్యవసాయం తగ్గింది. ఉద్యానపంటలు, డెయిరీ, పశుసంపద బాగా పెరిగింది అని అన్నారు.