సీసీఎల్ఏగా మళ్లీ నీరబ్ కుమార్ ప్రసాద్
ఆంధప్రదేశ్ రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్‌గా (సీసీఎల్ఏ)గా సీనియర్ ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ ప్రసాద్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం వరకు నీరబ్కుమారే సీసీఏల్ఏ పోస్టును పూర్తి అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆయనను పూర్తిస్తాయిలో సీసీఎల్‌గా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులిచ్చారు. నీరబ్‌కుమార్ అ•వీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉంటూనే, సీసీఎల్ఏ పదవినీ నిర్వహించేవారు. ఆయనను ఆ రెండు పోస్టుల నుంచి తప్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి పోస్టింగ్ కోసం సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని సూచించింది. మళ్లీ ఒకరోజు వ్యవధిలోనే సీసీఎల్ఏగా పూర్తిస్థాయిలో నీరబ్‌కుమార్‌ను నియమించింది. అసలు నీరబ్‌కుమార్ ప్రసాద్‌ను సీసీఎల్ఏ బాధ్యతల నుంచి ప్రభుత్వం ఎందుకు తప్పించింది? మళ్లీ ఆయనకే ఎందుకు అప్పగించిందనే ప్రశ్నలు అధికారవర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.













