రాజకీయ పక్షాల భేటీలో నీలం సాహ్ని సంచలన వ్యాఖ్యలు
ఎన్నికలు ఆపేందుకు ఎలాంటి కారణాలూ తమకు కనిపించడం లేదని, ఎన్నికల ప్రక్రియ ఆలస్యమైతే ఆ ప్రభావం వ్యాక్సినేషన్‌పై పడి, కరోనా విజృంభించే అవకాశం ఉందని నీలం సాహ్ని హెచ్చరించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత వివిధ రాజకీయ పక్షాలతో ఎస్ఈసీ నీలం సాహ్ని సమావేశం నిర్వహించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీల సహకారంపై చర్చించారు. ఎన్నికల నిర్వహణపై ఆయా పార్టీల సభ్యుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అయితే ఈ సమావేశానికి వైసీపీ, కాంగ్రెస్, సీపీఎం మాత్రమే హాజరయ్యాయి. టీడీపీ, బీజేపీ, జనసేన మాత్రం హాజరు కాలేదు. ఈ సందర్భంగా నీలం సాహ్ని మాట్లాడుతూ..ఏపీలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని ప్రకటించారు. ఎన్నికలకు అన్ని పార్టీలూ విధిగా సహకరించాలని కోరారు. అయితే అయితే కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని కోరారు. అన్నీ పరిశీలించిన తర్వాతే నోటిఫికేషన్ ఇచ్చామని అన్నారు. గతంలో ఏర్పాటు చేసిన నోడల్ వ్యవస్థే ఇప్పటికీ పనిచేస్తుందని, ఫిర్యాదులుంటే నిరభ్యంతరంగా స్వీకరిస్తామని సాహ్ని హామీ ఇచ్చారు.













