ఆంధ్రప్రదేశ్ కు ద్రౌపది ముర్ము రాక
రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రేపు (జూన్ 12) రానున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల మద్దతు కోరేందుకు విజయవాడకు వస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని మంగళగిరిలో జరిగే వైఎస్ఆర్సీపీ ఎంపీ, ఎమ్మెల్యేల సమావేశంలో ఆమె పాల్గొంటారు. ఎన్నికల్లో మద్దతివ్వాలని కోరనున్నారు. దేశ చరిత్రలో తొలిసారిగా రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ముకు అవకాశం వచ్చింది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించింది. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృతంలో జరిగే ఈ సమావేశంలో ఆమె పాల్గొని రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు ఓటు వేయాలని కోరనున్నారు.













