నవయుగ రూ.కోటి విరాళం
తిత్లీ బాధితులను ఆదుకునేందుకు ప్రముఖ కాంట్రాక్టు సంస్థ నవయుగ్ స్పందించింది. వారికి రూ.కోటి విరాళం అందించింది. నవయుగ సంస్థ చైర్మన్ విశ్వేశ్వరరావు పోలవరం ప్రాజెక్టు వద్ద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి రూ.కోటి చెక్కును అందజేశారు. అలాగే, టీడీపీ తెలంగాణ నేతలు నందీశ్వర్‌గౌడ్, శ్రీకాంత్ గౌడ్ రూ.5లక్షల చొప్పున పార్టీ అధినేత చంద్రబాబుకు ఎన్టీఆర్ భవన్లో చెక్కులు అందజేశారు. అలాగే గుంటూరు జిల్లా రేపల్లె మాజీ ఎమ్మెల్యే ఆప్కాబ్ డైరెక్టర్ ముమ్మనేని వెంకటసుబ్బయ్య రూ.లక్ష చెక్కును ఉండవల్లిలో చంద్రబాబుకు అందజేశారు.













