వైభవంగా ప్రారంభమైన నవరాత్రి బ్రహ్మోత్సవాలు
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు తిరుమలలో వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు శ్రీ మలయప్సస్వామివారు ఆదిశేషుడిపై ఉభయ దేవేరులతో వైకుంఠనాథుని అలంకారంలో తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. అనంతరం శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో నవరాత్రి కొలువును, బొమ్మల కొలువును ప్రత్యేకంగా నిర్వహించారు. రాత్రి వాహనసేన అనంతరం గంటపాలు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారిని పెద్దశేష వాహనంపై ఆసీనులను చేసి కార్యక్రమం చేపట్టారు. వాహన సేవల్లో అలసిపోయిన స్వామి, అమ్మవార్లకు ఉపశమనం కలిగించేందుకు కొలువు చేస్తారు. ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారు బంగారు తిరుచ్చిపై మాడవీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు.













