జూన్ 2 నుంచి నవనిర్మాణ దీక్షలు
జూన్ 2 నుంచి ఏడు రోజుల పాటు రాష్ట్రంలో నవ నిర్మాణ దీక్షలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. తొలిరోజు కార్యక్రమాన్ని విజయవాడ బెంజిసర్కిల్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారు. ఉదయం 9 నుంచి 11 గంటల దాకా జరిగే దీక్షలో ప్రసంగం, ప్రతిజ్ఞ ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఇదే సమయంలో అన్ని జిల్లాల్లో ప్రతిజ్ఞా కార్యక్రమం విజయవతం చేసేలా బహిరంగసభలు నిర్వహిస్తారు. ప్రజలతో ప్రతిజ్ఞ చేయించడం ఇదే సమయంలో ఇళ్లలో ఉండేవారు కూడా తమ కుటుంబ సభ్యులతో కలిసి ప్రతిజ్ఞ చేయాలి. వారం రోజుల పాటు అన్ని శాసనసభా నియోజకవర్గాల్లో వివిధ అంశాలపై ప్రసంగాలు, చర్చా కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. జూన్ 8న కాకినాడలో జరిగే మహాసంకల్పం కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతారు. జూన్ 3 నుంచి 7 దాకా విజయవాడలో భారీ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులు అన్ని కార్యక్రమాలను సమన్వయ పరుచుకోవాల్సి ఉంటుంది.













