కాకినాడలో….నేడు మహా సంకల్పం
ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రవ్యాప్తంగా జూన్ 2వ తేదీ నుంచి నిర్వహిస్తున్న నవ నిర్మాణ దీక్షా కార్యక్రమాలు నేటితో ముగియనున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు, జిల్లా కేంద్రల్లో భారీగా సభలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగే మహా సంకల్ప సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. కాకినాడ ఆనందభారతి మైదానంలో జరిగే సభలో ఈ మూడేళ్ల పాలనలో సాధించిన ప్రగతి, నిర్దేశించుకున్న లక్ష్యాలపై చంద్రబాబు ప్రసంగిస్తారు.













