జూన్ 2 ఆంధ్రప్రదేశ్ కి చీకటి రోజని
జూన్ 2 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చీకటి రోజని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడలోని బెంజి సర్కిల్లో నిర్వహించిన నవనిర్మాణ దీక్షలో ఆయన పాల్గొని.. అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మంత్రులు నారా లోకేశ్, కామినేని శ్రీనివాస్ తదితరులు, పెద్దయెత్తున ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘రాష్ట్ర విభజనను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నా. రాష్ట్ర విభజను వ్యతిరేకంగా అందరూ పోరాడాలి. జరిగిన నష్టాన్ని గుర్తుచేసుకుని అభివృద్ధికి పునరంకితం కావాలి. అన్ని గ్రామాలు, పట్టణాల్లో నవనిర్మాణ దీక్షలు నిర్వహిస్తున్నాం. విభజన బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టిన సందర్భంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరు బాధాకరం. పార్లమెంటు తలుపులు మూసేసి.. ప్రత్యక్ష ప్రసారాలు ఆపేసి.. అడ్డుకున్న తెదేపా ఎంపీలపై దాడి చేసి అరంగంటలో బిల్లు ఆమోదింపచేసుకున్నారు.













