NATS: నెవాడాలో చాప్టర్ ప్రారంభించిన నాట్స్
అమెరికాలో నాట్స్ తెలుగువారు ఎక్కడ ఉంటే అక్కడ నాట్స్ విభాగాలను ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నెవాడాలో నాట్స్ చాప్టర్ (NATS Chapter) ప్రారంభమైంది. నెవాడలోని రెనో నగరంలో జరిగిన ఈ కార్యక్రమంలో నెవాడా తెలుగు ప్రజలు నాట్స్ చాప్టర్ ప్రారంభంలో పాల్గొన్నారు. అమెరికాలో తెలుగువారికి ఏ కష్టం వచ్చినా నాట్స్ అండగా నిలబడుతుందని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasant Pinnamaneni) అన్నారు.
నెవాడాలో నాట్స్ చాప్టర్ ప్రారంభించడానికి ముందుకు వచ్చిన తెలుగువారిని అభినందించారు. నెవాడాలో నాట్స్ విభాగం ఏ కార్యక్రమం చేపట్టినా దానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి అన్నారు. నాట్స్ భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు. లలిత పరస, వందన షెనాయ్ జాయింట్ కోఆర్డినేటర్ గా బాధ్యతలు స్వీకరించారు. నెవాడా చాప్టర్ ప్రారంభోత్సవంలో దాదాపు 60 మంది తెలుగువారు పాల్గొన్నారు.













