అమరావతికి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి జాతీయ హరిత ట్రైబ్యునల్ అనుమతి ఇచ్చింది. రాజధాని నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన నాలుగైదు పిటిషన్లపై విచారించిన ఎన్జీటీ తుదితీర్పు వెలువరించింది. అమరావతిలో పర్యావరణానికి హాని కలిగిస్తున్నారన్న పిటిషనర్ల అభ్యంతరాలను ఎన్జీటీ తోసిపుచ్చింది. పర్యావరణ శాఖ విధించిన 191 నిబంధనలను కచ్చితంగా అమలుచేస్తూనే నిర్మాణాలు సాగాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించింది. కొండవీటి వాగు దిశ మర్చినా ప్రవాహానికి ముప్పు లేకుండా చర్యలు తీసుకోవాలని ఎన్జీటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించింది. కృష్ణా నది ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు సృష్టించవద్దని ఆదేశించింది. అమరావతిలో నిర్మాణాలను పర్యవేక్షించించేందుకు రెండు కమిటీలను నియమించింది. ఈ కమిటీలు అమరావతిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు ఎన్జీటీకి చేరవేస్తుంటాయి.













