పోలవరం ప్రాజెక్టుకు భారీ జరిమానా
పోలవరం ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ భారీ జరిమానా విధించింది. పర్యావరణ అనుమతులు ఉల్లంఘిస్తూ పోలవరం నిర్మాణాన్ని చేపడుతున్నందుకు రూ.120 కోట్ల జరిమానా విధించింది. పురుషోత్తపట్నం, పట్టిసీమ, చింతలపూడి ఎత్తిపోతల పథకాలకు పర్యావరణ అనుమతులు తీసుకోకుండా పనులు చేపట్టినందుకు ఎన్జీటీ భారీ జరిమానా విధించింది. పురుషోత్తపట్నం కు రూ.24,56 కోట్లు, పట్టసీమకు రూ.24.90 కోట్లు, చింతలపూడికి రూ.73,6 కోట్లు కట్టాలని ఆదేశించింది. పర్యావరణ ఉల్లంఘనలపై సామాజికవేత్త పెంటపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే వట్టి వసంతకుమార్లు ధర్మాసనానికి ఫిర్యాదు చేశారు. 3 నెలల్లోగా జరిమానా చెల్లించాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఏపీ కాలుష్య నియంత్ర మండలికి ఈ జరిమానా చెల్లించాలని చెప్పింది. నిధులు వినియోగంపై ఏపీపీసీబీ, సీపీసీబీ సభ్యులతో కమిటీని నియమించాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ స్పష్టం చేసింది.













