యార్లగడ్డకు జాతీయ పురస్కారం ప్రదానం
ఆంధ్ర విశ్వవిద్యాలయం హిందీ విభాగం గౌరవ ఆచార్యులు, రాజ్యసభ మాజీ సభ్యులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఇంటలెక్చువల్ ఆఫ్ ది ఇయర్-2024 పురస్కారం లభించింది. రిఫాసిమెంటో ఇంటర్నేషనల్ సంస్థ బోర్డ్ ఆఫ్ ఎడిటర్స్ ఈ పురస్కారాన్ని ఆచార్య లక్ష్మీ ప్రసాద్ కు ప్రకటించగా, తన కార్యాలయంలోని వీసీ ప్రసాద రెడ్డి వైఎల్పీకి అవార్డును అందజేశారు. ఏయూ ఆచార్యులు సాధించే పురస్కారాలు వర్సిటీ ప్రతిష్టను పెంచుతాయని వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆచార్య లక్ష్మీ ప్రసాద్‌ను పలువురు విశ్వవిద్యాలయ ఆచార్యులు అభినందించారు.













