Narendra Modi: ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని మోదీ పర్యటన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) అక్టోబర్ 16న రానున్నారు. కర్నూలు (Kurnool), నంద్యాల (Nandyal) జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు. శ్రీశైలం (Srisailam) మల్లికార్జున స్వామిని మోదీ దర్శించుకోనున్నారు. కర్నూలులో మోదీతో కలిసి కూటమి నేతల రోడ్‌షో ఉండనుంది. జీఎస్టీ సంస్కరణలపై మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భారీ ర్యాలీ నిర్వహించను న్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ మేరకు మోదీ పర్యటన వివరాలను మంత్రి నారా లోకేశ్ శాసనమండలి లాబీలో మంత్రులు, ఎమ్మెల్సీల వద్ద ప్రస్తావించారు.