Narayana : ఎవరూ అలాంటి ప్రచారం నమ్మొద్దు : మంత్రి నారాయణ
రాజధాని అమరావతి (Amaravati) లో క్వార్టర్స్, ఇతర భవనాల నిర్మాణంలో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర మంత్రి నారాయణ ఆదేశించారు. రాజధానిలో పర్యటించి ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా నిర్మాణ సంస్థలకు ఆదేశాలిచ్చామన్నారు. అమరావతి నిర్మాణం జరగడం లేదని వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. ఎవరూ అలాంటి ప్రచారం నమ్మొద్దు. వంద శాతం మూడేళ్లో పూర్తిచేస్తాం. మొత్తం 4 వేల ఫ్లాట్ల నిర్మాణం వచ్చే మార్చి నాటికి పూర్తవుతుంది. ఇక్కడ ఉండే అధికారులు, ఉద్యోగుల కోసం ఎస్ఆర్ఎం, విట్ యూనివర్సిటీలు సీబీఎస్ఈ స్కూల్స్ (CBSE Schools) , ఆసుపత్రులు (Hospitals) , వచ్చే మార్చి నాటికి ఏర్పాటు చేస్తున్నాయి. భవనాలు పూర్తయ్యే నాటికి అన్ని వసతులు కల్పిస్తాం. రైతుల రిటర్నబుల్ ఫ్లాట్లలో మౌలిక వసతుల కల్పన వర్షాలు తగ్గిన వెంటనే ప్రారంభిస్తాం. గత ప్రభుత్వం సింగపూర్ అధికారులపై కేసులు పెట్టి వేధించింది. వాళ్లకు ఒక నగరాన్ని ఎలా నిర్మించాలో అవగాహన లేదు. వారి నిర్వాకంతో ఏపీ, సింగపూర్ (Singapore) మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. సింగపూర్ పర్యటనలో అక్కడి ప్రభుత్వానికి ఏపీపై ఉన్న ముద్ర పోయేలా చర్చిస్తాం అని తెలిపారు.







