అధైర్యపడొద్దు అండగా ఉంటా.. మంత్రి లోకేశ్ భరోసా
కష్టాల్లో ఉన్నవారికి అండగా ఉంటానని ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ భరోసా ఇచ్చారు. ఉండవల్లిలోని నివాసంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కు మంగళగిరితో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. ఉదయం నుంచే లోకేశ్‌ను నేరుగా కలిసి తమ సమస్యలు విన్నవించేందుకు బారులు తీశారు. ఎవరూ అధైర్యపడవద్దని, సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరి వద్ద నుంచి వినతిపత్రాలు స్వీకరించి సంబంధిత శాఖలకు పంపాలని సిబ్బందిని ఆదేశించారు.













