అసలు నేను ఏమన్నానని నాకు.. నోటీసులు ఇచ్చారు ?
దక్షిణ భారత బిహార్‌గా ఆంధ్రప్రదేశ్‌ని మార్చేశారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. యువగళం పాదయాత్రలో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా వెంపలో క్షత్రియ సామాజిక వర్గం ప్రతినిధులతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ నా పాదయాత్రలో రాళ్లు, సీసాలతో దాడులు చేశారు. ఎంపీ రఘురామ సొంత నియోజకవర్గానికి వచ్చే పరిస్థితి లేదు. రఘురామను పలురకాలుగా వేధిస్తున్నారు. నాకు రక్షణ కోసం ఉన్న యువగళం వాలంటీర్లను తీసుకెళ్లారు. అసలు నేను ఏమన్నానని నాకు నోటీసులు ఇచ్చారు? వైసీపీ నేతలకు చట్టాలు చుట్టాలుగా మారాయి. కొందరు పోలీసుల వల్ల ఆ శాఖలోని అందరికీ చెడ్డపేరు వస్తోంది అని అన్నారు.













