అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే… ఆ హామీ
తక్షణమే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలంటూ సీఎం జగన్కు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేశ్ బహిరంగ లేఖ రాశారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామన్న హామీ ఏమైందని నిలదీశారు. మానవత్వంతో పనిచేసే ప్రభుత్వం అని ప్రచారం చేసుకున్న మీపాలనలో చనిపోయిన 600 మంది అగ్రిగోల్డ్ బాధితుల్లో ఏ ఒక్క కుటుంబానికైనా ఇస్తామన్న రూ.10 లక్షల పరిహారం ఇచ్చారా? కనీసం పరామర్శించారా? ఇదేనా మీ మానవత్వం. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అగ్రిగోల్డ్ విషయంలో టీడీపీ ప్రభుత్వంపై, నాపై చేసిన ఆరోపణలు చిమ్మిన విషం ఇంకా మరిచిపోలేదు. నాటి సీఎం వైఎస్ పాలనలో పుట్టిన అగ్రిగోల్డ్ ఆయన హయాంలోనే స్కామ్ చేసింది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక అగ్రిగోల్డ్ ఆస్తులు 21 వేల ఎకరాలు అటాచ్ చేసి, యాజమాన్యాన్ని అరెస్టు చేయించి, బాధితులకు న్యాయం చేశాం. అయినా, మాపై తప్పుడు ఆరోపణలు చేశారు. ప్రతిపక్షనేతగా హామీలిచ్చి గద్దెనెక్కాక వైసీపీ చేసిన మోసంతో రోడ్డునపడిన అగ్రిగోల్డ్ బాధితులు యువగళం పాదయాత్రలో నన్ను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు అని పేర్కొన్నారు.













