ఎన్ని అడ్డంకులు సృష్టించినా .. నిర్వహించి తీరుతాం
ఎన్ని అడ్డంకులు సృష్టించినా అన్న క్యాంటీన్ నిర్వహించి తీరుతామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ స్పష్టం చేశారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెనాలిలో అన్న క్యాంటీన్‌ను పోలీసులు, అధికారులు అడ్డుకోవడంపై మండిపడ్డారు. అన్నం తినే వారెవ్వరూ అన్న క్యాంటీన్‌ను అడ్డుకోరని తీవ్రంగా ధ్వజమెత్తారు. నందిగామ, మంగళగిరి, కుప్పంలో అన్న క్యాంటీన్లను అడ్డుకున్నారని, ఇప్పుడు తెనాలిలో అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ మానవత్వం అనేదే లేదా? అని ప్రశ్నించారు. తెనాలీలో పోలీసు పహారా పెట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండిరచారు. అన్న క్యాంటీన్‌తో పేద వాళ్ల ఆకలి తీరుస్తామని లోకేష్ స్పష్టం చేశారు.













