2019 నాటికి లక్ష ఉద్యోగాలు
ఐటీ రంగంలో 2019 నాటికి లక్ష ఉద్యోగాల కల్పనే లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. విశాఖ జిల్లా భీమిలి మండలం కాపులుప్పాడ ఐటీ పార్కు స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అక్టోబర్ నాటికి కాపులుప్పాడ ఐటీ పార్కులోకి కంపెనీలను ఆహ్వానిస్తామని పేర్కొన్నారు. మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత రాష్ట్రానికి 30 కంపెనీలు తీసుకురాగలిగానని అన్నారు. ఐటీ రంగంలో కేవలం 5 నెలల్లోనే ఆరు వేల మందికి ఉపాది కల్పించామని తెలిపారు. 2019 నాటికి లక్ష ఉద్యోగాల కల్పనే తమ లక్ష్యమన్నారు. ఎలక్ట్రానిక్ విభాగంలో మరో 2 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పారు. సోషల్ లైఫ్ కోసం విశాఖలో నెలకొక ఈవెంట్ నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నామన్నారు. యువతను ఆకర్షించేలా విశాఖను తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.













