జగన్ కల నెరవేరింది : లోకేష్
జగనన్న వచ్చారు.. వరల్డ్ బ్యాంక్ పోయింది. వైఎస్ జగన్‌గారి కల నెరవేరింది అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు. అమరావతిపై పాడెపై తగులబెడుతున్నట్లు వేసిన కార్టూన్ని జత చేశారు. మొత్తానికి అమరావతిని పడగొట్టేశారు. రైతులను రెచ్చగొట్టడం పంటలు తగలబెట్టడం, దొంగ ఉత్తరాలు.. ఇలా జగనన్న చరిత్ర తెలుసుకున్న వరల్డ్ బ్యాంక్ ఇక సెవలంది. బాబుగారి హయాంలో కళకళలాడిన అమరావతి మీ తుగ్లక్ చర్యలతో ఖాళీ అయింది. అమరావతి నిర్మాణాన్ని అడ్డుకునే కార్యాచరణలో జగన్ మొదటి అడుగు విజయంవంతంగా వేశారు.
ఇక ఆంధ్రుల కలల రాజధాని కేవలం కలగానే మిగిలిపోతుందేమో. ఇంత జరిగిన తరువాత కూడా మంత్రి బుగ్గన 2006లోనే అధిక వడ్డీకి మీరు ఆంధ్రకి లోన్ ఇవ్వొద్దు అంటూ వైఎస్ వరల్డ్ బ్యాంక్‌కి లేఖ రాశారు. అందుకే ఆయనపై ఉన్న గౌరవంతో వెనక్కివ వెళ్లారు.. అని లేఖ తీసుకొచ్చినా ఆశ్చర్యం లేదు. అసెంబ్లీ సాక్షిగా మరో నవరత్నం జారిపోయింది. రైతు భరోసా కింద ప్రతి ఏటా రైతులకు రూ.12,500 ఇస్తాం అని ప్రకటించి, ఇప్పుడు తూచ్ మేము ఇచ్చేది రూ.6,500 మాత్రమే అని మడమతిప్పి రైతులను మోసం చేశారు. ఈ మాత్రం దానికి పాదయాత్రలో కూతలు, అధికారం లోకి వచ్చిన తరువాత కోతలు ఎందుకు జగన్‌గారూ? అని లోకేశ్ విమర్శించారు.













