బ్రహ్మణి నాకు దేవుడిచ్చిన బహుమతి
బ్రహ్మణి నాకు దేవుడిచ్చిన బహుమతి అని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్లో పేర్కొన్నారు. మంత్రి నారా లోకేష్, బ్రహ్మణిల వివాహం జరిగిన పదకొండేళ్లు పూర్తయిన విషయాన్ని మంత్రి లోకేష్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఈ సందర్భంగా తన సతీమణి బ్రహ్మణికి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేవుడిచ్చిన బహుమతి అంటూ బ్రహ్మణీని ఉద్దేశించి ట్వీట్ చేశారు. సముద్రపు ఒడ్డున బ్రహ్మణితో ఉన్న ఫోటోను ట్వీట్‌కు జత చేశారు. దీంతో ఈ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు సినీ, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు అభినందనలతో ముంచెత్తుతున్నారు.













