Nara Lokesh ఎన్టీఆర్కు తప్పనిసరిగా భారతరత్న : నారా లోకేశ్
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్, నారా భువనేశ్వరి (Bhuvaneshwari ) ఎన్టీఆర్ ఘాట్ (NTR Ghat) వద్ద నివాళి అర్పించారు. అనంతరం లోకేశ్ (Lokesh) మీడియాతో మాట్లాడుతూ నాడు ఎన్టీఆర్ ప్రభంజనం సృష్టించి టీడీపీ (TDP)నీ అధికారంలోకి తీసుకొచ్చారని గుర్తు చేశారు. అనేక సంస్కరణలు తెచ్చారని తెలిపారు. టీడీపీలో కోటి మంది సభ్యత్వాలు తీసుకోవడం గర్వకారణమన్నారు. తెలుగు జాతి ఎక్కడ ఉన్నా అగ్రస్థానంలోకి ఎదగాలని ఆకాంక్షించారు. ఎన్టీఆర్ (NTR) రాజకీయాల్లో మహానాయకుడిగా రాణించారు. ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదు, ప్రభంజనం. రెండు రూపాయలకు కిలో బియ్యం, మహిళలకు ఆస్తుల్లో సమాన వాటా తదితర సంస్కరణలు తీసుకొచ్చారు. ఆయనకు తప్పనిసరిగా భారతరత్న వస్తుందని ఆశిస్తున్నాం. తెలుగు ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తాం. విశాఖ ఉక్కును కాపాడుకుంటున్నాం. తెలంగాణలో పార్టీ పునర్నిర్మాణంపై చర్చిస్తున్నాం. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. తెలంగాణలో 1.60 లక్షల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. టీడీపీపై తెలంగాణ ప్రజలకు ప్రేమ, ఆశ ఉంది అని తెలిపారు.













