యువగళం యాత్రకు బయులుదేరిన నారా లోకేష్
తెలుగుదేశం పార్టీ యువతనే, మాజీ మంత్రి నారా లోకేష్ యువగళం పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రను ఈ నెల 27వ తేదీ నుంచి కుప్పం నుంచి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మానాన్న నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి, అత్తమామలు నందమూరి బాలకృష్ణ, వసుంధర నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు లోకేష్. ఒక ఆయన సతీమణి నారా బ్రాహ్మణి హారతి పట్టి, బొట్టు పెట్టి, విషెస్ తెలిపారు. అక్కడి నుంచి లోకేష్ నేరుగా ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకుని ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. మామ బాలకృష్ణ దగ్గరుండి ఆయనను కారు ఎక్కించారు. లోకేశ్ రాకతో ఎన్టీఆర్ ఘాట్ వద్ద పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు, నేతలు చేరుకున్నారు. దీంతో అక్కడ కోలాహలం నెలకొంది. అటు నుంచి కడపకు బయలుదేరారు. అక్కడి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అదే సమయంలో కడపలోనే ఓ చర్చ్లోనూ లోకేష్ ప్రార్థనలు చేస్తారు. రాత్రికి తిరుమలకు చేరుకుని అక్కడే బస చేస్తారు.













