టీడీపీ పునాదులు గట్టిగా ఉన్నాయి… ఎవరూ ఏం చేయలేరు
తెలుగుదేశం పార్టీ పునాదులు గట్టిగా ఉన్నాయని ఎవరూ ఏం చేయలేరని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. మహానాడు వేదికగా నిర్వహించిన బహిరంగ సభలో లోకేశ్ మాట్లాడారు. టీడీపీ స్థాపించిన 40 ఏళ్ల చరిత్రలో ఈ రోజుది ప్రత్యేకమైన స్థానమన్నారు. తెలుగుదేశం పార్టీని ఏదో చేద్దామని అనుకున్నవారంతా గాలిలో కలిసి పోయారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వైఎస్ఆర్సీ అంటే యువజన శృంగార రౌడీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. చంద్రబాబు రాముడు అయితే జగన్ రాక్షసుడని ఎద్దేవా చేశారు. పెట్రోల్, డీజల్ ధరల్లో రాష్ట్రం నంబర్‌వన్‌గా ఉందన్నారు. చెత్త పన్ను, ఇసుక ధరల్లో ఏపీ దూసుకెళ్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రం విషయంలో సీఎం జగన్‌కు ఎలాంటి ముందు చూపు లేదని, కేవలం మందు చూపు మాత్రమే ఉందని విమర్శించారు. శవాన్ని అడ్డం పెట్టుకొని వైసీపీ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.













