Nara Lokesh :దేశానికే ఆదర్శంగా ఏపీ : మంత్రి లోకేశ్
రాష్ట్ర చరిత్రలో తొలిసారి టీచర్ల సీనియారిటి జాబితా ప్రకటిస్తామని, వారి బదిలీల కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తెలిపారు. శాసనసభలో ఆయన మాట్లాడారు. విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయులు (Teachers) ప్రధాన పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. వారిపై భారం ఉంటే సరిగా పాఠాలు చెప్పలేరని పేర్కొన్నారు. ఐబీ స్కూళ్లు (IB schools ) ఏర్పాటు చేస్తామని గత ప్రభుత్వం ప్రగల్భాలు పలికింది. వీటి ఏర్పాటుకు నివేదిక తెప్పిస్తామని రూ.5 కోట్లు ఖర్చు చేసింది. వన్ క్లాస్ -వన్ టీచర్ (One class – one teacher )విధానాన్ని నేను బలంగా విశ్వసిస్తా. ప్రభుత్వం కేవలం 1400 పాఠశాలల్లోనే ఈ విధానం ఉంది. 10 వేల స్కూళ్లలో దీన్ని అమలు చేస్తాం. విద్యార్థులకు బ్యాగ్ బరువు తగ్గించేలా సంస్కరణలు తీసుకొస్తున్నాం. వారికి నాణ్యమైన యూనిఫామ్ (Uniform) ఇస్తున్నాం. విద్యా రంగంలో సంస్కరణల కోసం అన్ని వర్గాలు కలిసి పనిచేయాలి. అందరూ కలిసి పనిచేస్తే దేశానికే ఆదర్శంగా ఏపీ నిలుస్తుంది అని అన్నారు.













