కేంద్రం హెచ్చరించినా సీం జగన్ లో చలనం లేదు : లోకేష్
బొగ్గు కొరత ఏర్పడుతుందని 40 రోజులు ముందే కేంద్ర ప్రభుత్వం హెచ్చరించిన సీఎం జగన్‌లో చలనం లేదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలపై ఆయన స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే ఇంట్లో ఫ్యాన్ అగిపోయిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని జగన్ అంధకారంధ్రప్రదేశ్‌గా మార్చారని విమర్శించారు. ఓ వైపు విద్యత్ ఛార్జీల పెంపు పేరుతో ప్రజలపై భారం మోపుతున్నారు. మరో వైపు విద్యుత్ కొరతతో అంధకారంలో ఉండాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. బొగ్గు ఉత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన రూ.215 కోట్ల బకాయిలు చెల్లించకపోవడం దారుణమన్నారు. అవసరం మేర బొగ్గు నిల్వ చేసుకోవాలన్న కేంద్రం హెచ్చరికలను రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని ఆరోపించారు.













