తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. ఆ వర్గాలకు ప్రత్యేక రక్షణ చట్టం
వైసీపీ పాలనలో రాష్ట్రంలో 300 మంది బీసీలను హత్య చేశారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. హిందూపురంలో నిర్వహించిన టీడీపీ శంఖారావం సభలో ఆయన మాట్లాడారు. 26 వేల మంది బీసీలపై అక్రమ కేసులు నమోదు చేశారన్నారు. రెండు నెలలు ఓపిక పట్టాలని, ఆ దొంగ కేసులు ఎత్తివేస్తామన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ వర్గాలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తామన్నారు. బీసీలకు స్వయం ఉపాధి కోసం ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు. ఆదరణ పథకం కింద రూ.5 వేల కోట్లు కేటాయిస్తామన్నారు. టీడీపీ తీసుకొచ్చిన 100 సంక్షేమ కార్యక్రమాలను జగన్ రద్దు చేశారని విమర్శించారు.













