వైసీపీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచే .. లోకేశ్
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి అక్రమ కేసులు పెడుతున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా ఆయన ఢిల్లీలో చేపట్టిన ఒక్కరోజు దీక్ష పూర్తయింది. అనంతరం లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబును జైలుకు పంపాలని కుయుక్తులు పన్నారు. ఆయన మద్దతుగా మొన్న ప్రజలంతా మోత మోగించారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు కల్పించాలని స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టును చంద్రబాబు తీసుకొచ్చారు. స్కిల్ కేంద్రాల్లో శిక్షణ పొందిన 80 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి అని తెలిపారు.













