ఎలక్ట్రానిక్స్ హబ్‌గా ఏపీ … లోకేష్
ఆంధ్రప్రదేశ్‌ను ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి హబ్‌గా మార్చడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఎలక్ట్రానిక్ పరిశ్రమలను ఆకర్షించేందుకు చేయాల్సిన విధానపరమైన మార్పులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ను ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి హబ్‌గా మార్చడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. వచ్చే మంత్రివర్గ సమావేశంలోపు ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీలను ఆకర్షించే విధంగా నూతన విధానానికి తుదిరూపు తీసుకురావాలని ఆదేశించారు. పెట్టుబడి, ఉపాధి కల్పన ఆధారంగా పరిశ్రమలకు రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు. పరిశ్రమలకు పెట్టుబడులు ఆధారంగా 25శాతం వరకు, గరిష్ఠంగా రూ.250 కోట్ల వరకు సబ్సిడీ ఇవ్వనున్నారు.













