బీసీల వెన్ను విరిచిన జగన్.. నారా లోకేష్ వైరల్ స్టేట్మెంట్..
ఈ రాష్ట్రంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కారణంగా బీసీ కులాలకు చెందిన ప్రజలు ఎటువంటి లబ్ధి పొందారు అని నారా లోకేష్ ప్రశ్నించారు. నారా లోకేష్ చేపట్టిన శంఖారావం యాత్రలో భాగంగా గురువారం ఉమ్మడి అనంతపూర్ జిల్లాలోని హిందూపురంలో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. లక్షల కోట్లు తినేసి జైల్లో ఉండి వచ్చిన వ్యక్తికి ఎటువంటి విజయం ఉంటుంది అంటూ ఈ సభలో నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కి తెలిసిందల్లా మద్యం ద్వారా ఎలా సంపాదించాలి ?క్వారీలలో డబ్బులు ఎలా దోచుకోవాలి ? ఇసుకను డబ్బులుగా ఎలా మార్చుకోవాలి? మాత్రమే అంటూ ఆయన ఎద్దేవా చేశారు. గత మూడేళ్లుగా మూడు రాజధానుల కాన్సెప్ట్ తో ప్రజలను తికమక పెడుతున్నారని.. విశాఖ లో జగన్ చేసిన మొదటి పని 500 కోట్లు ఖర్చుపెట్టి ప్యాలెస్ కట్టడం మాత్రమే అని ఆయన అన్నారు. మాట్లాడితే విజన్ అంటాడు కట్టిన ఫ్లోటింగ్ బ్రిడ్జి ఒక్కరోజులో కొట్టుకుపోయింది అదేనా వీళ్ళ విజన్ అంటూ ఈ నేపథ్యంగా నారా లోకేష్ ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు జగన్ బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు బ్యాక్ బోన్ క్లాస్ అని అన్నారు.. కానీ ఎన్నికల్లో గెలిచాక బీసీల వెన్ను విరిచారు. తమ ప్రభుత్వం పాలనలోకి వస్తే 50 ఏళ్లు నిండిన బీసీలకు నాలుగు వేలు నిలపించను ఇస్తామని బీసీల రక్షణకు చట్టాన్ని తీసుకువస్తామని ఎన్నో హామీలను ఈ సందర్భంగా లోకేష్ బీసీలకు ఇచ్చారు.













