వారు ఎక్కడున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదు : లోకేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాకపోయినా రాష్ట్రంలో గంజాయి పరిశ్రమ మాత్రం బాగా నడుస్తోందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ గంజాయితో యువత భవిష్యత్తను ప్రశ్నార్థకం చేస్తున్నారని అన్నారు. పోలీసులే దగ్గరుండి దాడులు చేయించడం దారుణమన్నారు. ఎవరూ లేని సమయంలో వైసీపీ మూకలు దాడిచేశారు. దమ్ముంటే ఇప్పుడు రావాలని సవాల్ విసిరారు. పోలీసుల అండ లేకుండా వైసీపీ నేతలు బయటకు రావాలన్నారు. చట్టాన్ని ఉల్లంఘించి టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్న పోలీసు అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. వారు ఎక్కడున్నా రాబోయే రోజుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
పసుపు జెండా చూస్తే మీకు ఎందుకంద భయం అని అన్నారు. కొన్ని పిల్లులు పులులమని భావిస్తున్నాయి. మా ఆఫీసులో పగిలింది అద్దాలు మాత్రమే మా కార్యకర్తలు గుండెలు మీరు గాయపచలేరు. టీడీపీ కార్యకర్తలు కేసులకు భయపడక్కర్లేదు. ఒక చెంప మీద కొడితే రెండు చెంపలు వాయగొడతాం. జగన్రెడ్డిలా నేను చిన్నాన్న జోలికి వెళ్లలేదు. జగన్ మగాడైతే చిన్నాన్న హత్యకేసు తేల్చాలి. రెండున్నరేళ్లు ఆగండి చంద్రబాబే మళ్లీ సీఎం అన్నారు. 2024లో మంగళగిరిలో టీడీపీని గెలిపించి కానుకగా ఇస్తామన్నారు. వైకాపాకు ట్రైలమర్ మాత్రమే చూపాం సినిమా ముందుంది అని అన్నారు.













