మీ అభిమానాన్ని మించిన విజయమేముంది?
లక్షలాది మంది ప్రజల అభిమానానికి మించిన విజయం మరొకటి లేదని మాజీ మంత్రి నారా లోకేష్ సృష్టం చేశారు. ఉండవల్లి నివాసానికి తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానుల ఎదుట లోకేష్ భావోద్వేగంతో మాట్లాడారు. మంగళగిరిలో ఓటమి చవిచూసినా ప్రజల మనసు గెలుచుకుని విజేతగా నిలిచానని సృష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు, ఎన్నికల్లో గెలుపుఓటములు సహజమన్నారు. మంగళగిరి నుంచి పోటీ చేసే సమయంలోనే తనకు సంకేతాలు అందాయన్నారు. ఇప్పటి వరకు మీ కుటుంబ సభ్యుడిగా అదరించారు. ఇకపై ఏ కష్టం వచ్చినా ఏ సహాయం కావాలన్నా మా ఇంటి తలుపులు తీసే ఉంటాయని భరోసా ఇచ్చారు. మరోవిడత మంగళగిరి నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని, త్వరలో గ్రామాల్లో తిరిగి ప్రజా సమస్యలపై చర్చిస్తామన్నారు.













