అన్ని ఒక్కచోట ఉన్నపుడే కాకపోతే.. మూడుచోట్ల ఉంటే
అన్ని ఒక్కచోట ఉన్నపుడే పనులు కాకపోతే, మూడు వ్యవస్థలు మూడుచోట్ల ఉంటే పనులెలా సాధ్యమని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పాలనా వికేంద్రీకరణ కాదని, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ టీడీపీతోనే సాధ్యమని తెలిపారు. పరిపాలనా విభాగాన్ని ఒకేచోట ఉంచి, అన్ని జిల్లాలను అభివృద్ధి చేయాలనేదే తమ లక్ష్యమని తెలిపారు. ఆనాడు జగన్ మోహన్ రెడ్డి అమరావతికి మద్దతిచ్చి, ఇప్పుడు కాదనడం మోసం కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేనివాళ్లు మూడు రాజధానులు కడతారా? అంటూ ఎద్దేవా చేశారు. తమ శాఖ అధికారులు కోర్టుల చుట్టూ తిరగడం వల్లే ఏ పని కావడం లేదని మంత్రి సురేష్ అంటున్నారని అన్నారు. ప్రిజనరీ వ్యవస్థల నాశనం గురించి ఆలోచిస్తే విజనరీ భావి తరాల బాగు కోరుకుంటాడన్నారు. జగన్రెడ్డి ప్రజనరీ అయితే చంద్రబాబు విజనరీ అని అన్నారు.













