మన్నవ మోహనకృష్ణను అభినందించిన నారా లోకేశ్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎన్టీఆర్ ట్రస్ట్ మన్నవ మోహన్ కృష్ణ పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ, కడప జిల్లా జమ్మలమడుగులో నిర్వహించిన పాదయాత్రలో లోకేశ్‌తో పాటు నడిచారు. యువగళం పాదయాత్రలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని, ఈ యాత్ర వల్ల రైతుల్లో నమ్మకం, యువతలో భరోసా, నిరుపేదల్లో దైర్యం వచ్చిందని, యువగళం పాదయాత్ర ముందుకు సాగే కొద్ది అధికార పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఈ సందర్భంగా నారా లోకేశ్‌తో మన్నవ మోహన కృష్ణ అన్నారు. యువగళం దెబ్బకి వైసీపీ తుడిచిపెట్టుకుపోతుందని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం తీసుకుంటున్న చర్యలను, చేస్తున్న పార్టీ కార్యక్రమాలను నారా లోకేశ్‌కు మోహన్ కృష్ణ వివరించారు. నిత్యం ప్రజల్లో ఉంటూ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు అండగా ఉంటున్న మోహన కృష్ణని నారా లోకేశ్ అభినందించారు.













