ఓటమి భయంతోనే వైసీపీ దాడి : లోకేశ్
చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ మూక దాడిని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య ఎన్నికల వ్యవస్థలో గెలుపు ఓటమలు సహజమని, అపజయం తప్పదనే సంకేతాలతో వైసీపీ తన ఫ్యాక్షన్ విష సంస్కృతికి తెరలేపిందని మండిపడ్డారు. పద్మావతి మహిళ యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలించేందుకు వచ్చిన పులివర్తి నానిపై వైసీపీ మూక దాడి దిగ్భ్రాంతికి గురి చేసింది. నాని అన్నతో మాట్లాడాను. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించాను. పోలీసులు వైసీపీ మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.













