కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ని కలిసిన నారా లోకేశ్
ఢిల్లీలోని కృషి భవన్ లో కేంద్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ గారిని కలిసి, రాష్ట్రానికి రావాల్సిన ఉపాధిహామీ బకాయిలను వెంటనే విడుదల చెయ్యాలని కోరాను. రాష్ట్రంలోని 346 కరువు మండలాల్లో 150 రోజుల పనిదినాలు, ఎక్కువ మందికి పని కల్పించడానికి అనుమతించాలని కోరాను. మార్చి లోపు రూ.150 కోట్లు వేతనాలు రూపంలో, రూ.200 కోట్లను మెటీరియల్ కింద ఇచ్చేందుకు కేంద్రమంత్రి శ్రీ తోమర్ గారు అంగీకరించారు. అలాగే రాష్ట్రానికి చెల్లించవలసిన మిగిలిన వేతన, మెటీరియల్ బకాయిలను త్వరలోనే విడుదల చేసేందుకు కృషిచేస్తామని వారు తెలిపారు.













