Nara Lokesh : సీఎం ఆదేశిస్తే తల వంచుకొని అమలు చేస్తాం : లోకేశ్
అధికారంలో ఉన్నా కష్టపడాల్సిందే అహంకారంతో వ్యవహరించకూడదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం లో నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు నమ్మకంతో బాధ్యత అప్పగించారని, దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పారు. కార్యకర్తల సమావేశం తర్వాతే ఏ కార్యక్రమమైనా మొదలుపెట్టాలని సూచించారు. బాగా పనిచేసిన కార్యకర్తలను గుర్తిస్తున్నామని తెలిపారు. అమరావతి బిల్లు (Amaravati Bill) విషయంలో టీడీపీ ఎమ్మెల్సీ (TDP MLC)లను కొనాలని చూశారు. వాళ్లు మాత్రం చంద్రబాబు (Chandrababu)తోనే ఉంటామని చెప్పారు. ప్రతిపక్షంలో ఉండగా పార్టీ కార్యకర్తలు, నేతలపై అక్రమ కేసులు పెట్టారు. వైసీపీ నేతల చర్యలతో టీడీపీ కార్యకర్తలు ఆర్థికంగా, శారీరకంగా నష్టపోయారు. చంద్రబాబు అభివృద్ధి చేసిన జైలులోనే ఆయన్ను పెట్టినప్పుడు చాలా బాధ కలిగింది. జగన్ (Jagan )పై ఎంత పోరాడానో, పార్టీలో అంతకంటే మూడు రెట్లు పోరాడాను. కొన్ని విషయాల్లో విభేదించినా అంతిమ నిర్ణయం సీఎందే. సీఎం ఆదేశిస్తే తల వంచుకొని అమలు చేస్తాం. కూటమిలోని మూడు పార్టీల నేతలు సమన్వయంతో ముందుకెళ్లాలి అని అన్నారు.













