Rajnath Singh: కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో నారా లోకేశ్ భేటీ
కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh)తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను రాజ్‌నాథ్ సింగ్‌కు లోకేశ్ వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో డిఫెన్స్ క్లస్టర్ (Defense Cluster) ఏర్పాటు చేయాలని కోరారు. రక్షణ రంగ పరికరాల యూనిట్లు రాష్ట్రానికి వచ్చేలా చూడాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ని తిరిగి అభివృద్ధి పట్టాలు ఎక్కిస్తున్నట్లు వివరించారు. అమరావతి (Amaravati), పోలవరం (Polavaram) పనులు సాగుతున్న తీరును లోకేశ్ వివరించారు. అప్పుల్లో ముగిసిన ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రం ఆక్సిజన్ అందిస్తోందని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహాయ, సహకారాలు అందిస్తామని రాజ్‌నాథ్ సింగ్ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాసవర్మ, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు.













