ఐటీలో లక్ష ఉద్యోగాలు లక్ష్యం – లోకేష్
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) రంగంలో లక్ష ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఐటాప్) ప్రతినిధులతో శుక్రవారం నాడిక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఐటి అభివద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఐటి రంగంలో లక్ష ఉద్యోగాలను కల్పించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసినట్లు లోకేష్ వివరించారు. పెట్టుబడులు పెట్టాలని విదేశాలకు వెళ్లి కంపెనీలను ఆహ్వానిస్తున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కంపెనీలను బలోపేతం చేయడానికి కూడా చర్యలు చేపడుతున్నామన్నారు.
ఐటి కంపెనీలకు భూములు కేటాయించడానికి అభ్యంతరం లేదని, అయితే ఆయా కంపెనీలు ముందుగా రాష్ట్రానికి వచ్చి తమ కార్యకలాపాలను ప్రారంభించాలని సూచించారు. దీనివల్ల ఆయా కంపెనీల చిత్తశుద్ధి బయటపడుతుందన్నారు. డిటిపి పాలసీని అమలు చేస్తున్నామని, దీని ద్వారా కంపెనీలు తక్షణమే తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు వీలుంటుందన్నారు. ఐటి రంగ అభివ ద్ధి, ఐటి కంపెనీల సమస్యల తక్షణ పరిష్కారానికి ఐటి కంపెనీల ప్రతినిధులు, ఐటి శాఖ అధికారులతో ఇండస్ట్రీ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించారు.













