విశాఖలో 8 ఐటీ సంస్థలు ప్రారంభం : లోకేశ్
విశాఖ పట్నంలో ఎనిమిది ఐటీ సంస్థలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. విశాఖ పర్యటనలో ఉన్న ఆయన ఎపెక్స్ కంటెంట్ సొల్యూషన్స్, వెంటర్ ఆఫ్ షోర్ ఫార్మాటిక్స్, ఐడీఏ ఆటోమేషన్, జీవా డిజిటల్ సర్వీసెస్, అవ్వా ఇన్ వెట్రాక్స్, వర్చువల్ గార్డ్ సర్వీసెస్, ఆమ్ జ్యూర్ ఇన్ఫోటెక్స్, విస్మయ ప్రీమీడియా సంస్థలను ప్రారంభించాయి. విశాఖ కేంద్రంగా ఈ సంస్థలు కార్యాకలాపాలు నిర్వహిస్తాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రానున్న కాలంలో నవ్యాంధ్ర ఆర్థిక ప్రగతికి విశాఖ ముఖ్య కేంద్రం కానుందని అన్నారు. డ్రోన్ల తయారీ కేంద్రంగా విశాఖ రూపొందనుందని అన్నారు. ఈ పరిశ్రమ ప్రారంభానికి తాను 60 రోజుల్లో మళ్లీ విశాఖకు రానున్నట్లు సృష్టం చేశారు. ఒకవైపు విశాఖలో భూమి కొరత ఉందని అంటుందే, మరోవైపు తమ తమ స్థలాలు కొనేవారే లేరని రియల్ఎస్టేట్స్ సంస్థలు చెబుతున్నాయని ఈ పరిస్థితిపై అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. రానున్న కాలంలో పంచాయతీల్లో పారిశుద్ధ్యంపై డ్రోన్లతో పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. దక్షిణాసియాలో పెట్టుబడులు పెట్టేవారికి విశాఖ ఉత్తమ ఆకర్షణగా నిలవనుందని అన్నారు. ఈ సంస్థల ద్వారా 4వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ఇందులో భాగంగా తొలి విడతలో 900 మందికి ఉద్యోగాలు ప్రకటించినట్లు తెలిపారు.













