లోకేశ్ భవిష్యత్ కోసం…
వచ్చే ఎన్నికల తర్వాత కూడా అధికారంలోకి వచ్చి తన కుమారుడైన లోకేశ్ రాజకీయ భవిష్యత్‌కు గట్టి పునాదులు వేయవలసిన అవసరం చంద్రబాబుకు ఉంది. భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయాలు జగన్మోహన్రెడ్డి-– లోకేశ్ చుట్టూనే ఉంటాయి కనుక నంద్యాలలో ఇప్పుడు జగన్‌ను ఓడించి, రెండేళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో కూడా దెబ్బతీయగలిగితే లోకేశ్ రాజకీయ భవిష్యత్తుకు ఢోకా ఉండదని చంద్రబాబు భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నంద్యాల ఉప ఎన్నిక ఉభయ పక్షాలకూ ప్రతిష్ఠాత్మకంగా మారింది. తన రాజకీయ భవిష్యత్తును సుస్థిరపరచుకోవాలంటే నంద్యాలను గెలుచుకోవాల్సిన అవసరం ఉండటంతోపాటు ప్రశాంత్ కిశోర్ వంటివారి సలహా మేరకు పాదయాత్ర చేపట్టాలని జగన్మోహన్రెడ్డి నిర్ణయానికి వచ్చి ఉంటారు. నంద్యాలలో చతురంగ బలాలను మోహరించిన అధికార-– ప్రతిపక్షాలలో విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూద్దాం!













