Golden Temple: స్వర్ణ దేవాలయాన్ని సందర్శించిన లోకేశ్ దంపతులు
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉన్న సిక్కుల పవిత్ర స్థలం స్వర్ణ దేవాలయాన్ని(Golden Temple) ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) తన సతీమణి నారా బ్రహ్మణి(, Nara Brahmani), కుమారుడు దేవాంశ్ (Devansh) లతో కలిసి సందర్శించారు. తలకు సంప్రదాయ వస్త్రాన్ని చుట్టుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వారికి స్వర్ణమందిర్ చరిత్ర, విశేషాలు, ప్రత్యేకతల్ని శ్రీహర్మందిర్ సాహిబ్ నిర్వాహకులు వివరించారు. నిత్యం వేల మంది భక్తుల ఆకలి తీర్చే స్థానిక లంగర్‌హౌస్ (Langerhouse)ను పరిశీలించారు.. రోజుకు ఎంత మందికి ఆహారం అందిస్తారు? వండిరచే పదార్థాలేంటి, ఇందుకోసం ఎంతమంది పనిచేస్తారు? తదితర వివరాల్ని లోకేశ్, బ్రహ్మాణి తెలుసుకొన్నారు. అందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని ప్రార్థించాను. పవిత్ర హర్మందిర్ సాహిబ్‌ను సందర్శించే భాగ్యం దొరకడం సంతోషంగా ఉంది. సిక్కు గురువుల ఆశీస్సులు పొందాను. ఆ ఆవరణలో గడిపిన సమయం ఆధ్యాత్మిక ప్రశాంతతను చేకూర్చింది అని లోకేశ్ తెలిపారు.













