Nara Lokesh: నారావారిపల్లెలో ఉన్నా మనసంతా మంగళగిరిపైనే!
భార్య బ్రహ్మణికి మంగళగిరి చేనేత చీర బహుమతిగా ఇచ్చిన లోకేష్
అమరావతి: మనిషి ఎక్కడ ఉన్నా ఆయన మనసంతా మంగళగిరి(Mangalagiri) లోనే ఉంటుంది. మంగళగిరి చేనేతలంటే ఆయనకు వల్లమాలిన అభిమానం. అవకాశం ఉన్న ప్రతిచోటా మంగళగిరి చేనేతను ప్రమోట్ చేస్తూ చేనేతల ఆత్మ బంధువుగా మారారు మంత్రి నారా లోకేష్(Nara Lokesh). చేనేతలపై అభిమానాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపుతున్నారు. సంక్రాంతి పండుగ వేడుకల కోసం కుటుంబంతో సహా నారావారిపల్లె వెళ్ళిన లోకేష్… భార్య బ్రహ్మణికి మంగళగిరి చేనేత చీరను స్పెషల్ గిఫ్ట్ గా ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. బ్రహ్మణి సంక్రాంతి రోజున మంగళగిరి చీర కట్టుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అవకాశం ఉన్న ప్రతిచోట తల్లి భువనేశ్వరి, భార్య బ్రహ్మణి మంగళగిరి చేనేతను ప్రమోట్ చేస్తూ బ్రాండ్ అంబాసిడర్లుగా మారారు. తమపై లోకేష్, ఆయన కుటుంబ చూపుతున్న అభిమానానికి మంగళగిరి చేనేతలు మురిసిపోతున్నారు.













