ఇసుక కొరతపై నారా లోకేష్ దీక్ష
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరతపై విపక్ష పార్టీలు ఆందోళన ఉధృతం చేస్తున్నాయి. అందులో భాగంగా భవన నిర్మాణ కార్మికులకు అండగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి నారా లోకేష్ నిరసన దీక్ష చేపట్టారు. గుంటూరు కలెక్టరేట్ ఎదుట దీక్ష చేశారు. వైసీపీ నేతలు బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడడంవల్లే ఇసుక దొరకడం లేదని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు ఆకలి బాధలతో అల్లాడుతున్నారని.. అయినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకుండా రాష్ట్రంలో ఎక్కడా ఆకలి బాధలు లేవని చెబుతోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.













