సీఎం చంద్రబాబు కుటుంబ ఆస్తులు ఇవే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబసభ్యుల ఆస్తులను ఆయన తనయుడు, మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. కొనుగోలు ధరలనే ప్రకటిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మార్కెట్ విలువ ప్రకారమే ఆస్తుల విలువ మారుతూ వస్తోందని వివరించారు. తమ ఆస్తులను ప్రకటిస్తూ రావటం ఇది వరుసగా ఏడోసారని తెలిపారు. దేశంలో మరే రాజకీయ కుటుంబం తమ మాదిరిగా ఆస్తులు ప్రకటించట్లేదని చెప్పారు. మా కుటుంబంపై కొంతమంది ఆరోపణలు చేస్తున్నారని, మాపై విమర్శలు చేసేవాళ్లు ఏనాడైనా వారి ఆస్తులు ప్రకటించారా? అని ప్రశ్నించారు. పద్ధతి ప్రకారం వ్యాపారం చేయడం తప్పుకాదని అన్నారు. వారసులుగా అవకాశం వచ్చిన మాట వాస్తమేనని, అయితే వారసులుగా మేం సమర్థంగా పనిచేయకుంటే రాజకీయాల్లో నిలబడలేమన్నారు.
వైకాపా అధినేత జగన్ సొంతంగా ఎప్పుడూ ఆస్తులు ప్రకటించలేదని, ఆయన ఆస్తులను సీబీఐ, ఈడీలు ప్రకటిస్తున్నాయని విమర్శించారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు హెరిటేజ్‌పై 17 కేసులు వేశారని, అయితే ఏ ఒక్కటీ నిరూపించలేకపోయారని లోకేశ్ పేర్కొన్నారు.
ఆస్తులు వివరాలు :
చంద్రబాబు నికర ఆస్తులు : రూ.2.53 కోట్లు
భువనేశ్వరి నికర ఆస్తులు : రూ.25.41 కోట్లు
లోకేశ్ నికర ఆస్తులు : 15.26 కోట్లు
బ్రహ్మణి నికర ఆస్తులు : రూ.15.01 కోట్లు
దేవాన్ష్ నికర ఆస్తులు : రూ.11.54 కోట్లు













